గచ్చిబౌలిలో సినీ నటి రమ్యశ్రీపై కత్తులతో దాడి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఎఫ్.సి.ఐ. కాలనీలో భూ వివాదం నేపథ్యంలో సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌పై దుండగులు దాడి చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్లాట్ యజమానుల సమక్షంలో రోడ్లు మాపింగ్ చేస్తుండగా, సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు కత్తులు, క్రికెట్ బ్యాట్‌లతో హింసాత్మకంగా విరుచుకుపడ్డారు.

ఈ దాడిలో గాయపడిన రమ్యశ్రీ, ప్రశాంత్ వెంటనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. “పట్టపగలే మా మీద హత్యాయత్నం జరిగింది. న్యాయంగా మా హక్కుల కోసం పోరాడుతుంటే దాడి చేశారు,” అని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ రావు అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

Latest Articles