
మోహన్ బాబు నిర్మాతగా శివ పురాణాలలోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథను ఆధారంగా కన్నప్ప చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలోని కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషించుగా మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదం, ఆటంకం వస్తూనే ఉంది. అయినా అలాగే కొనసాగుతున్న ఈ చిత్రంపై మంచు విష్ణుకు ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇటీవలే ఈ చిత్రం నుండి టీజర్ ఇంకా పాటలు విడుదల కాగా బ్రాహ్మణ సంఘం నుండి అభ్యంతరం వెలుగులోకి వచ్చింది. చిత్రంలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, పిలక పాత్రలు తమను కించపరిచే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రలు సమాజాన్ని, సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు ఆ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపింది. అనంతరం ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎఫ్సి సీఈవో, సిబిఎఫ్సి అధికారి, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, వెంకట ప్రభుదాస్, బ్రహ్మానందం, సప్తగిరి లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనితో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన కన్నప్ప చిత్రం మరోసారి వాయిదా పడనుండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం చేయగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా మంచు మోహన్ బాబు నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.