
బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్లో రానున్న చిత్రం సోలో భాయ్. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయటపెట్టారు. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9వ సీజన్ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ప్రతి సీజన్లోనూ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లిన ప్రతి ఒక్కరికి కొంత రెమ్యూనరేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా సీజన్ 7లో బిగ్ బాస్ కు వెళ్లి 10 వారాలు గౌతమ్ కృష్ణ హౌస్ లో ఉన్నారు. అయితే ఈ ట్రైలర్ నుంచి సందర్భంగా తాను సమవర్తి అనే ట్రస్ట్ ద్వారా తాను సంపాదించే సంపాదనలో ఇకనుండి సగభాగం సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా సేవ చేస్తానని అన్నారు. దానిలో భాగంగా ముందుగా తాను బిగ్ బాస్ హౌస్ లో 10 వారాల పాటు ఉండి తీసుకున్న రెమ్యూనరేషన్ లో నుండి సగభాగాన్ని ఈ ట్రస్ట్ కు డొనేట్ చేస్తున్నా అని వెల్లడించారు. అంతేకాక దానిలో నుండి మొదటి లక్ష రూపాయలను దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ తల్లిదండ్రులకు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి వారాలలో తాను 30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు, వాటిలో 15 లక్షల రూపాయలు ఈ సమవర్తి ట్రస్టుకు ఇస్తున్నట్లు చెప్పారు. అంతేకాక తాను భవిష్యత్తులో సంపాదించే ప్రతి రూపాయిలను సగం ఈ ట్రస్టు ద్వారా సామాన్యులకు ఉపయోగపడేందుకు తను ప్రయత్నిస్తానని, అలాగే దానికి సంబంధించిన వివరాలను ప్రతినెల తన సోషల్ మీడియా హ్యాండ్ ద్వారా అందరికీ తెలిసేలా ఉంటాయని తెలిపారు.