
ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు, మీడియా నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ధనుష్, నాగార్జునల నటనా పాటవం గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నటించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.
టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జున, ఇలాంటి సవాల్‌తో కూడిన పాత్రను స్వీకరించడం గొప్ప ధైర్యానికి నిదర్శనం. రొమాంటిక్ ఇమేజ్‌కు భిన్నంగా, డీ-గ్లామ్ రోల్‌లో నాగార్జున నటన ప్రేక్షకులను, విమర్శకులను ఒకేలా ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల లాంటి సునిశిత దర్శకుడు క్రైమ్ డ్రామా తీస్తానని ముందుకొచ్చినప్పుడు, ఆయనను ప్రోత్సహిస్తూ ఈ పాత్రను ఒప్పుకోవడమే కాకుండా, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతను కూడా నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు. ఈ పాత్రతో ఆయన మళ్లీ పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.
కుబేరలో నాగార్జున నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలోనూ ఈ పాత్రకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. నటుడిగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయేలా నాగార్జున నటించడమే కాదు, ఆ పాత్రలో జీవించారని చెప్పడం సబబు. శేఖర్ కమ్ముల సినిమాల్లో క్యారెక్టర్లు సహజంగా ఉంటాయని పేరుంది, అలాంటి ఒక సహజమైన పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. సవాల్‌తో కూడిన ఈ పాత్రలో కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్లతోనే భావోద్వేగాలను పలికించిన తీరు అద్భుతం. ప్రేక్షకులు, విమర్శకులు ఆయన నటనను చూసి ఆశ్చర్యపోతూ, “ఈ క్యారెక్టర్‌ను నాగ్ ఎలా ఒప్పుకున్నాడు? ఇంత అద్భుతంగా ఎలా నటించాడు?” అని చర్చించుకుంటున్నారు.
మొత్తంగా, కుబేర సినిమాలో నాగార్జున పాత్ర టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ పాత్రతో ఆయన తన నటనా సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలతో నాగార్జున మరింత ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.