
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కీలకపాత్రలు పోషిస్తూ పోషిస్తూ శేఖర్ కొమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం కుబేర. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ములను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా రాపిడ్ ఫెయిర్ పేరిట చైతు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో శేఖర్ కమ్ముల తన జీవితంలో చేసిన ఓ దొంగతనం గురించి బయటపెట్టారు. చేతు తమ చిన్ననాటి జీవితంలో తమ ఇంట్లో తండ్రి జేబు నుండి చేసిన అతి పెద్ద దొంగతనం ఏంటి అని ప్రశ్నించగా దానికి శేఖర్ కమ్ముల తాను చిన్నతనంలో 50 పైసలు దొంగతనం చేశానని చెప్పారు. ఆ డబ్బుతో గాలిపటం కొన్నానని, అప్పట్లో 50 పైసలు అంటే పెద్ద అమౌంట్ అని సమాధానం ఇచ్చారు. అదేవిధంగా అగ్ని నాగార్జున రూపాయి, రెండు రూపాయల నోట్లు దొంగతనం చేశానని, అప్పట్లో పది రూపాయలు అంటే చాలా ఎక్కువ అని అన్నారు. అయితే అదే తీరులో చేతు కూడా తన చిన్నతనంలో 500 రూపాయలు ఉంటే అమౌంట్ అని సమాధానం ఇచ్చారు.