
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.