‘ఉప్పు కప్పురంబు’ చిత్ర రివ్యూ

భారతదేశంలోని ప్రముఖ ఓటిపి ప్లాట్ఫారం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 5 భాషల్లో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఉప్పు కప్పురంబు. కీర్తి సురేష్, సుహాస్ ముఖ్య పాత్రలలో కనిపిస్తూ శుభలేఖ సుధాకర్, రామేశ్వరి, బాబు మోహన్, శత్రు, శివన్నారాయణ తదితరులు కీళ్లతో పాత్రలో పోషిస్తూ అని ఐ వి శశి దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రాన్ని రాధిక లావు నిర్మించగా స్పీకర్ ఆగస్తి కంపోజింగ్ చేశారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ చేయగా శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రానికి విషయాలు చూస్తే…

కథ:
ఓ గ్రామంలోని ఆచారాలను, కట్టుబాట్లను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం ఉంటుంది. 1990ల నాటి చిట్టి జయపురం అనే పిచ్చి గ్రామంలో కీర్తి సురేష్ పాలన గురించి ఏమీ తెలియకపోయినా గ్రామంలోని ప్రముఖురాలిగా ఎన్నికవుతుంది. ఇంతలో సుహాస్ అనే సమాధి తవ్వేవాడు తన తల్లితో అదే గ్రామంలో నివసిస్తూ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఒక పంచాయితీ సమావేశంలో చిన్న ఒక ముఖ్యమైన సమస్యను లేవనెత్తాడు. గ్రామ స్మశానవాటికలో నాలుగు స్థలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అకస్మాత్తుగా ప్రతి గ్రామస్థుడు తమకంటూ ఒక స్థలాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటాడు. విషయాలను మరింత భావోద్వేగంగా మార్చడానికి చిన్న తల్లికి కూడా ఒక చివరి కోరిక ఉంటుంది. అయితే అపర్ణ సమస్యను పరిష్కరించడానికి ఎలా ప్రయత్నిస్తుంది? సుహాస్ ఆమెకు ఎలా సహాయపడతాడు? తన తల్లి చివరి కోరిక అతను ఎలా నెరవేరుస్తాడు? అనే దాని చుట్టూ ఈ చిత్రం ఉంటుంది.

నటీనటుల నటన :
అమాయకపు ఊరు పెద్దగా కీర్తి సురేష్ బాగా నటించినప్పటికీ ఆ పాత్ర ఇంకా కాస్త దృఢంగా ఉంటే బాగుండే కనిపిస్తుంది. స్మశానంలో సమాధులు తొవ్వుకునే పాత్రలో అటు అమాయకత్వంగా అలాగే ఇటు కాస్త తెలివిగా సుహాస్ బాగా నటించారు. అలాగే ఊరి పెద్ద కావాలని ఆశతో బాబు మోహన్, శత్రు పోటీ పడుతూ సినిమా అంతటా పోటీ పడుతూ మంచి వినోదాన్ని అందించారు. సుహాస్ తల్లి పాత్రలో రాజేశ్వరి అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. కీర్తి సురేష్ తండ్రిగా శుభలేఖ సుధాకర్ తక్కువ సమయం కనిపించినప్పటికీ నటనలో తనదైన మార్క్ వేసుకున్నారు. అలాగే క్రమంలోని ఇతర నటీనటును తమ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ:
అని ఐవి శశి ఒక చక్కటి ప్రయత్నంతో ఈ కథను ప్రేక్షకులు ముందుకు తీసుకుని రావడంలో పర్వాలేదు అనుకోవచ్చు. కానీ క్యారెక్టర్లు ఇంకా కాస్త బలంగా అలాగే ఇతర సాంకేతిక విజయాలలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అలాగే ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకు పాటలు ఇంకా బిజిఎం బలాన్ని చేకూర్చాయి. సినిమాలోని మాటలు, డైలాగ్స్ సీనులకు తగ్గట్లు మంచి సింక్ తో బాగున్నాయి. లొకేషన్లు చాలా న్యాచురల్ గా సాధారణంగా 90 నాటి గ్రామంలోని ప్రతి విషయాన్ని ప్రతిభంభిస్తూ ఒక వింటేజ్ వైబ్ సృష్టించేలా ఉన్నాయి. అలాగే కలరింగ్ ఇంకా లైటింగ్ వంటి ఇతర సాంకేతిక విషయాలలో దర్శకుడు బాగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, బిజిఎం, పాటలు,సాంకేతిక విశేషాలు.

మైనస్ పాయింట్స్:
కథలోని క్యారెక్టర్లు బలంగా లేకపోవడం, స్టోరీ ల్యాగ్.

సారాంశం:
1990 నాటి వింటేజ్ వైబ్ తో ఇంట్లోనే కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటూ ఓ చక్కటి కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉంది.

Related Articles

Latest Articles