జూలై 25న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘మహావతార్ నరసింహ’

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో అలరించబోతోంది.

ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పించిన శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ డైనమిక్ భాగస్వామ్యం సినిమాటిక్ అద్భుతాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ కోసం లైనప్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది. విష్ణువు దశ అవతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.

‘మహావతార్ నరసింహ చిత్రం 3Dలో ఐదు భారతీయ భాషలలో 2025 జూలై 25న విడుదలవుతోంది.

Related Articles

Latest Articles