
తమిళ, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యువ నటి తాన్య రవిచంద్రన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రముఖ కెమెరామన్ గౌతమ్ జార్జ్‌తో ఆమె నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ ఆనందకర క్షణాన్ని పంచుకుంటూ, తాన్య-గౌతమ్ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ముద్దు పెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాన్య రవిచంద్రన్, ప్రముఖ తమిళ నటుడు రవిచందర్ మనవరాలు. తమిళ, తెలుగు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో ‘రాజా విక్రమార్క’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందింది. మరోవైపు, గౌతమ్ జార్జ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేస్తున్నారు.
ఈ జంట నిశ్చితార్థం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో వీరి వివాహం జరగనుండగా, అభిమానులు, సన్నిహితులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


