
సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తూ లెజెండరీ డైరెక్టర్ జోషీ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (UMF) మరియు ఐన్స్టిన్ మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను జోషీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వెలువడింది.
‘మెప్పడియాన్’, ‘మార్కో’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న UMF, ఇప్పుడు జోషీతో చేతులు కలిపి మరో స్థాయికి చేరనుంది. కథ & స్క్రీన్‌ప్లేను అభిలాష్ ఎన్. చంద్రన్ అందిస్తున్నారు, ఆయన ‘పొరించు మరిఅమ్ జోస్’, ‘కింగ్ ఆఫ్ కొథా’ వంటి చిత్రాలతో భావోద్వేగ కథాంశాలకు పేరు తెచ్చుకున్నారు.
హీరో ఉన్ని ముకుందన్ మాస్ యాక్షన్ అవతారంలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. “Driven by Passion, Now Fuelled by Ego” నినాదంతో UMF యూత్, ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే కథలతో ముందుకు సాగుతోంది. ఐన్స్టిన్ మీడియా ‘ఆంటోనీ’, ‘పురుష ప్రేతం’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన బ్యానర్, ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి సత్తా చాటనుంది.
పాన్-ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ భారీ చిత్రం యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది.


