పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” చిత్ర రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడి పాత్ర పోషిస్తూ ఏఎం రత్నం నిర్మాతగా భారీ బడ్జెట్లో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయక పాత్ర పోషించగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. బాబి డియోల్ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించుగా సత్యరాజ్, సునీల్, నాజర్, రఘు బాబు, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, నిహార్ కపూర్, అయ్యప్ప, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇక ఈ రివ్యూ విషయానికి వస్తే…

కథ :

ఒక వజ్రాల దొంగగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు ప్రయాణంలోకి గోల్కొండ నవాబు వస్తారు. అదే మార్గంలో పంచమి వస్తుంది. అయితే ఈ చిత్రం ముందు నుండి చెప్పినట్లు కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వజ్రాల దొంగ అయినా వీరమల్లు కోహినూర్ వజ్రం కోసమే ఢిల్లీకి ప్రయాణం అవుతాడా? ఔరంగజేబుకు,వీరమల్లు మధ్య ఘర్షణ ఏంటి? వీరి ప్రయాణంలో సనాతన ధర్మం ఎందుకు వస్తుంది? అసలు వీరమల్లు దేనికోసం ఢిల్లీ బయల్దేరాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన :

హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్)గా చిత్రంలో పాత్ర ఒక వీరుడి పాత్రగా అలాగే ధర్మాన్ని కాపాడే ఒక యోధుడిలా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పటివరకు ఎన్నడూ తాను పోషించని పౌరాణిక పాత్ర కావడంతో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించారు. అటు సాధారణ నటన దగ్గర నుండి ఒక దొంగగా, ప్రేమికుడిలా, యుద్ధ వీరుడిలా, ధర్మాన్ని కాపాడే యోధుడిలా ప్రతి కోణములను పూర్తి పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను, అభిమానులను పవన్ కళ్యాణ్ మెప్పించారు.

పంచమి (నిధి అగర్వాల్) పాత్రలో హీరోయిన్ ఎంతో అద్భుతంగా నటించారు. అటు ఒక అమాయకపు ఆడపిల్లల అలాగే ఇంకొక కోణంలో తనదైన పర్ఫార్మెన్స్ తో చిత్రంలో తనకంటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు నిధి.

అలాగే నాజర్, రఘు బాబు, సునీల్, సుబ్బరాజు, నిహార్ కపూర్, అయ్యప్ప చిత్రమంతటా పవన్ కళ్యాణ్ తో కనిపిస్తూ తనదైన పాత్రలలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ చక్కటి పర్ఫార్మన్స్ ఇచ్చారు.

ఔరంగజేబు(బాబి డియోల్) పాత్రలో ఎంతో క్రూరంగా నటించడంలో ఎక్కడ పడకుండా తన పాత్రకు న్యాయం చేశాడు బాబి డియోల్. తన సీన్స్ సినిమాలో తక్కువగా ఉన్నప్పటికీ సినిమా అంతక తన ఇంపాక్ట్ ఉంటుంది. అంత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.

వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు వంటి విలక్షణ నటులు వెండి తెరపై కనిపించిన సమయం తక్కువ అయినప్పటికీ తమదైన పాత్రలు చిత్రం అంతట ఇంపాక్ట్ ఉండేలా నటించారు. అలాగే వేరు వేరు పాత్రలలో నటించిన నటీనటులు అంతా తమ తమ పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :

ఒక కథను ఒక దర్శకుడు వెండి ధర పైకి తీసుకురావడం ఎంతో కష్టమైన పని. అటువంటిది ఒక కథకు ఇద్దరు దర్శకులు పనిచేయడం అంటే ఎంతో క్లిష్టమైనది. ఒకడి విజన్ మరొకరికి ఉండకపోవచ్చు కానీ ఈ సినిమా కోసం ఇద్దరు దర్శకులు ఎంతో కష్టపడి ఒకటే విజన్ తో వెండితెరపైకి తీసుకుని వచ్చారు. క్రిష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును జ్యోతి కృష్ణ ముందుకు తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. కథను వెండి ధరపై ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే అలా కనిపించడానికి గల కారణం డిఓపి. డిఓపి తన కెమెరాలో ప్రతి విజయవాడను బంధించి దర్శకుడి విజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి పాట సిచువేషన్ కు తగ్గట్లు అద్భుతంగా ఉన్నాయి. సినిమాలోని ప్రతి సిచువేషన్ కు తగ్గట్లు బిజిఎం అందించడంలో కీరవాణి అద్భుతమైన పాత్ర పోషించారు. యాక్షన్స్ సీన్స్ దగ్గర నుండి ఎలివేషన్ సీన్ల వరకు ప్రతి చోట బిజిఎం తో సినిమాను మరొక మెట్టు పైకి తీసుకుని వెళ్లారు. రెండవ భాగంలో కొన్ని సీన్లు విఎఫ్ఎక్స్ అంతగా అనిపించకపోయినప్పటికీ చిత్రం అంతటని జూమ్ అవుట్ చేసి చూస్తే చాలా చక్కగా వచ్చేందుకు సాంకేతిక బృందం ఎంత కష్టపడిందో అర్థమవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చిత్ర విశ్లేషణ :

సినిమా విషయానికి వస్తే సుమారు రెండు సంవత్సరాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్న సమయంలో వచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ధర్మం పట్ల ప్రజలు ఎలా నిలబడాలి అనే విషయాన్ని చూపిస్తూ ఈ చిత్రం ఉంది. మొదటి భాగం అంతా ఫ్యాన్స్ కు ఫిస్టులా అనిపిస్తుంది. రెండవ భాగం కొంచెం డల్ అయినప్పటికీ కొన్ని సీన్లు ఇంకా ఫైట్లు సినిమాను ఎప్పటికప్పుడు ఒక మెట్టు పైకెక్కిస్తూనే వచ్చాయి. బిఎఫ్ ఎక్స్ వల్ల ప్రేక్షకుడు అసంతృప్తి చెందినప్పటికీ క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. హరిహర వేద మల్లు పార్ట్ 2 యుద్ధ భూమికి ఒక చక్కటి బిగినింగ్ ఇచ్చేలా సినిమాను ముగించారు దర్శకుడు జ్యోతి కృష్ణ.

ప్లస్ పాయింట్స్ :

కథ, దర్శకత్వం, పాటలు, బిజిఎం, యాక్షన్ సీన్స్, కాస్ట్యూమ్స్, నటుల నటన.

మైనస్ పాయింట్స్ :

వి ఎఫ్ ఎక్స్, సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్లు.

సారాంశం :

కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా సినిమా ప్రేక్షకులు అందరిని సంతృప్తి పరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూసేందుకు కుటుంబ సమేతంగా చూసేలా హరిహర వీరమల్లు సినిమా ఉంది. ధర్మాన్ని నిలబెట్టే దిశగా వీరమల్లు ప్రయాణం ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుంది.

Related Articles

Latest Articles