
క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు ద్వారా సృష్టించబడ్డ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో వై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలుగా వివి సూర్య కుమార్ దర్శకత్వంలో ఆగస్టు 8వ తేదీన ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సిరీస్ కిఅరేబియన్ కడలి”. ఈ సిరీస్ లో సత్యదేవ్, ఆనందితో పాటు నాజర్, రఘుబాబు, దళిత్ తాహిల్, పూనం భాజ్వ, ప్రభావతి, హర్ష రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరాం, వంశీకృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, దినేష్ భట్, రవివర్మ, అమిత్ తివారి, నిహార్ పాండ్యా, అలోక్ జైన్ తదితరులు కీలకపాత్రలో పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సిరీస్ 200 దేశాలకు పైగా ఆగస్టు 8 నుండి స్ట్రీమ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.


