
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, స్పోర్ట్స్ పాలసీ 2025 ద్వారా క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. గ్రాస్‌రూట్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు, రాజకీయ జోక్యం లేని క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏర్పాటైంది.
ఈ బోర్డ్‌కు కో-చైర్మన్‌గా యూఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల నియమితులయ్యారు. వెల్‌నెస్, యువజన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఉపాసన, క్రీడాకారుల సంక్షేమం, క్రీడా విద్య, సుస్థిర అభివృద్ధిపై కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, క్రీడా నిపుణులను ఆహ్వానిస్తూ, తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (TSDF)ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ బోర్డ్ కృషి చేయనుంది.


