
ప్రముఖ నటి సంగీత తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలకు మూలంగా సంగీత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరును ‘సంగీత క్రిష్’ నుంచి ‘సంగీత యాక్టర్’గా మార్చుకున్నట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇటీవల జరిగిన హీరోయిన్ల గెట్ టుగెదర్‌కు ఆమె తన భర్త లేకుండానే హాజరైనట్లు కూడా కొన్ని సైట్లు రాసుకొచ్చాయి.
అయితే ఈ పుకార్లను నటి సంగీత గట్టిగా ఖండించారు. ఈ విషయంపై స్పందిస్తూ, “ఈ విడాకుల ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను మొదటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘సంగీత యాక్టర్’ అనే పేరునే ఉపయోగిస్తున్నాను. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం” అని సంగీత స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


