అమెజాన్ ప్రైమ్ “అరేబియన్ కడలి” రివ్యూ

క్రిష్ జాగర్లమూడి రచనతో మొదలై వి.వి సూర్యకుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిరీస్ అరేబియన్ కడలి. 8 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ కు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేయగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సిరీస్ కు చాణక్య రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా 5 భాషలలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నేటి నుండి ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే…

కథ :
2018 సంవత్సరంలో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారం చేసుకుని వచ్చిన అమెజాన్ ప్రైమ్ సిరీస్ అరేబియన్ కడలి. శ్రీకాకుళం జిల్లాలో జట్టిలు సరిగా లేకపోవడం వల్ల అక్కడ ఉండే కొన్ని మత్స్య కుటుంబాల నుండి కొంతమంది గుజరాత్ కు వలస వెళ్లి సముద్రంలో వేట చేసి ఇంటికి తిరిగి వస్తుంటారు. అలా జరిగే క్రమంలో వారిలోని ఒక యువకుడు బద్రి (సత్యదేవ్) తన పక్క గ్రామంలోని గంగ (ఆనంది) తో ప్రేమలో ఉంటాడు. అయితే ఒకసారి ఎప్పటిలాగానే వేటకు వెళ్ళిన వారు సముద్రంలో పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఇప్పటికే ఎన్నో పాత్రల ద్వారా తన నటనను ప్రతి శైలిలోను నిరూపించుకుంటూ వస్తున్నారు సత్యదేవ్. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా ఓ మత్స్యకారుడి పాత్రలో సత్యదేవ్ తనదైన పాత్రను అద్భుతంగా పెర్ఫాన్ చేశారు. అలాగే ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఆనంది గతంలో కూడా కొన్ని పాత్రలు చేసినప్పటికీ ఈ చిత్రంలో తన పాత్రను కూడా తెలవృతంగా పెర్ఫాం చేశారు. అటు పల్లెటూరి ఉత్తరాంధ్ర యాసతో కూడిన మాటలు, అలాగే అటువంటి బాడీ లాంగ్వేజ్ తో వారిద్దరూ పోటాపోటీగా ఎంత అద్భుతంగా నటించారు. నాసర్, పూనం బాజ్వ, అమిత్ తివారి, ప్రత్యూష సారు, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రల పరిధిలో న్యాయం చేస్తూ తమకు సూట్ అయ్యే పాత్రలతో అద్భుతంగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
యదార్థ సంఘటన తీసుకుని ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడం కాబట్టి ఇప్పటికే ఈ కథ తెలిసిన ప్రేక్షకులకు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అంతగా ఉండనప్పటికీ స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకులు విజయం సాధించారు. అలాగే విజువల్స్ ఇంకా ఇతర వి.ఎఫ్.ఎక్స్ ద్వారా సముద్రంలో జరిగే కొన్ని సీన్లు చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా డైలాగులు విషయంలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వ్యాస పట్టుకుని మూలాల నుండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. కలరింగ్ ఇంకా లొకేషన్లు బాగున్నాయి. సినిమాలో ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. నిర్మాణం విలువలు అద్భుతంగా ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
ఈ కథను గతంలో ఒక సినిమాగా తీసినప్పటికీ సినిమాలోని ఎమోషన్ బాగా వర్క్ అవ్వడం వల్ల ప్రేక్షకులు సినిమాకు ఎంతగానో కనెక్ట్ అవుతారు. అలాగే భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న సంభాషణలు అలాగే ఆనాటి సిచువేషన్ ల వలన మరింత ఉత్కంఠ రేపుతూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ప్రతి సీను రావడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ ప్రేక్షకులైతే పూర్తిగా సంతృప్తి చెందే విధంగా సినిమా ఉంది.

ప్లస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, బిజిఎం, నటీనటుల నటన, ఎమోషన్.

మైనస్ పాయింట్స్ :
తెలిసిన కథ కావడం, కొంత విఎఫ్ఎక్స్

సారాంశం :
ఒక యదార్థ సంఘటనను, నాటి సందర్భాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సిరీస్ అరేబియన్ కడలి.

Related Articles

Latest Articles