
ఎస్ఏ మూవీస్ పతాకంపై ఎస్ఎస్ శివ రచన దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మాతలుగా ప్రముఖ నటుడు ప్రవీణ్ ప్రముఖ పాత్రలో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం బకాసుర రెస్టారెంట్. హర్ష చెముడు, కే జి ఎఫ్ గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్, ఉప్పెన జయకృష్ణ, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలకపాత్రల పోషించగా వికాస్ బడిస ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి బాల సరస్వతి డిఓపిగా చేయగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక సాధారణ అసంతృప్తికర సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే యువకుడు పరమేష్(ప్రవీణ్) తన మరో నలుగురు స్నేహితులతో కలిసి ఒక బ్యాచిలర్ రూమ్ లో ఉంటాడు. రెస్టారెంట్ మొదలు పెట్టి తన కస్టమర్స్ అందరికీ మంచి భోజనం అందించాలనేది తన కోరిక. కానీ తన కుటుంబ పరిస్థితుల వలన జాబ్ వదిలేయక ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా అయినా జాబ్ చేస్తూనే తన రెస్టారెంట్ కు కావాల్సిన డబ్బును సమర్పించుకుంటూ ఉంటాడు కానీ అది కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో అసంతృప్తి గల వారికి ఒక తాంత్రిక విద్య గల పుస్తకం దొరుకుతుంది. ఈ క్రమంలో ఆ పుస్తకం ద్వారా వారు చేసిన కొన్ని కార్యక్రమాలలో తమ జీవితాల్లోకి ఒక తిండిబోతు దయ్యం వస్తుంది. అది వచ్చిన తర్వాత వీరి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? ఆ దయ్యం వల్ల వారి జీవితాలలో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? చివరికి ఆ దయ్యం వారిని ఏం చేస్తుంది? ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రవీణ్ ఇప్పటికే ఎన్నో చిత్రాలలో అటు కమీడియన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. కానీ ఈ చిత్రంలో అతనిదే ప్రముఖ పాత్ర కావడం ప్రేక్షకులలో ప్రవీణ్ ను చూసే కోణం మరోలా ఉంటుంది. అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి తన నటనను ఈ పాత్రలో తను ప్రదర్శిస్తూ అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ప్రవీణ్ పర్ఫార్మ్ చేసి చూపించారు. అలాగే వైవా హర్ష పాత్ర సినిమాలో ప్రత్యేకమని చెప్పుకోవాలి. అటు సెంటిమెంట్ అలాగే ఇటు క్యారక్టరైజేషన్ పరంగా నూటికి నూరు శాతం ప్రేక్షకులను మెప్పించారు. కేజిఎఫ్ గరుడ ఒక కాటి కాపరి పాత్రలో పర్ఫెక్ట్ గా నటించారు. చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన ఉప్పెన జయకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, కృష్ణ భగవాన్ తదితరులు తమ పాత్రలకు తగ్గ నటనను చేశారు. అలాగే మరికొన్ని పాత్రలలో కనిపించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
పేపర్ పై రాసుకున్న కథను వెండితెరపై తీసుకురావడంలో ఎస్.జే శివ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే మొదటి భాగంలో కాస్త స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేవిధంగా జాగ్రత్త పడ్డారు. సినిమాలోని పాటలు బాగున్నాయి. అలాగే సెంటిమెంట్ సీన్స్ దగ్గర బిజిఎం కూడా చాలా బాగా వచ్చింది. అటు టేకింగ్ దగ్గర నుండి ఎడిటింగ్ వరకు చాలా జాగ్రత్త పడి సినిమా తీసినట్లు తెలుస్తుంది. కలరింగ్ లొకేషన్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎంతో జాగ్రత్తగా తీసుకున్నట్లు అర్థమవుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
చిత్ర విశ్లేషణ :
సినిమా నిదానంగా మొదలై ఇంటర్వెల్ దగ్గర ప్రేక్షకులకు మంచి హయిస్తుంది. పాటలు వల్ల సినిమాకు ఎమోషన్ గా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. మొదటి భాగం కాస్త స్లోగా ఉంది అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమా అయితే ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్విస్తూ అలాగే ఆలోచనపై చేస్తూ స్నేహితుల మధ్య బంధాన్ని వివరిస్తూ ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, పాటలు, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
మొదటి భాగం కాస్త నిదానంగా ఉండటం, వి.ఎఫ్.ఎక్స్.
సారాంశం :
మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడి స్నేహబంధం విలువలను తెలియజేస్తూ కుటుంబ సమేతంగా ప్రేక్షకులు చూడదగిన చిత్రం బకాసుర రెస్టారెంట్.


