
నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కల్ట్ క్లాసిక్ ‘శివ’ త్వరలో తెలుగులో రీ-రిలీజ్ కానుంది, ఆ తర్వాత హిందీ, తమిళంలో విడుదలవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ చిత్రం 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఆగస్టు 14న విడుదలయ్యే ‘కూలీ’ చిత్రంతో రీ-రిలీజ్ టీజర్ విడుదల కానుంది. అత్యాధునిక AI సాంకేతికతతో ఒరిజినల్ మోనో సౌండ్‌ను డాల్బీ అట్మాస్‌గా మార్చారు. నాగార్జున మాట్లాడుతూ, “శివ నాకు ఐకానిక్ హీరో స్టేటస్ ఇచ్చిన చిత్రం. ఈ రీ-రిలీజ్‌తో కొత్త తరానికి ఈ కల్ట్ క్లాసిక్‌ను గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాం,” అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “ఈ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులు శివను కొత్త రూపంలో, అసాధారణ సౌండ్ అనుభవంతో చూస్తారు,” అన్నారు.


