
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన కుంకీ ఏనుగుల ఆపరేషన్ అద్భుత విజయం సాధించింది. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో అడవి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తూ, రైతుల ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి, అడవి ఏనుగుల గుంపులను అడ్డుకునేందుకు వినూత్న చర్యలు చేపట్టారు.
ఈ ఆపరేషన్ ఫలించడంతో పంటల నష్టం తగ్గడమే కాక, రైతులకు భద్రత కూడా లభించింది. ఈ విజయవంతమైన చర్యలకు రైతులు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా రైతుల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ చూపిన చొరవ మరియు నిబద్ధత సర్వత్రా ఆకర్షిస్తోంది.


