‘కూలీ’ బ్లాక్‌బస్టర్ విజయం: నాగార్జున, రజనీకాంత్ జోడీ మ్యాజిక్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున సైమన్ పాత్రలో నటించి, తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి నటించిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్లు వసూలు చేసి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

తెలుగు వెర్షన్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 17 కోట్లు, ఉత్తర అమెరికాలో $1.3 మిలియన్లు వసూలు చేసి సత్తా చాటింది. “రజనీకాంత్‌తో కలిసి నటించడం మరపురాని అనుభవం. ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడం సహజమే,” అని నాగార్జున అన్నారు. ‘కుబేర’ తర్వాత ‘కూలీ’తో నాగార్జున మరో విజయాన్ని అందుకున్నారు. త్వరలో ఆయన ఐకానిక్ చిత్రం ‘శివ’ 4K, డాల్బీ అట్మాస్‌లో రీ-రిలీజ్ కానుంది.

Related Articles

Latest Articles