రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోనున్న హరిణ్య రెడ్డి ఎవరో తెలుసా?

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఆగస్టు 17న హరిణ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హరిణ్య రెడ్డి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో నెలకొంది. ఆమె టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. ఆమె కుటుంబం నందమూరి బాలకృష్ణకు సన్నిహితమని తెలుస్తోంది. ఈ విషయాన్ని కోటంరెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాహుల్, హరిణ్య గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

Latest Articles