“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి లిరికల్ సాంగ్ అప్డేట్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ‘ఏం జరుగుతోంది…’ లిరికల్ సాంగ్ ను ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా ‘ఏం జరుగుతోంది…’ రూపొందించారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్

సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్

కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ

ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి

పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక

మార్కెటింగ్ – ఫస్ట్ షో

సమర్పణ – అల్లు అరవింద్

బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్

నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Related Articles

Latest Articles