వినాయక చవితి సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా “శివం శైవం” పోస్టర్ విడుదల

వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ చేతుల మీదుగా విడుదల చేసారు. దినేష్ కుమార్ , అన్షు Ponnachen , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి Zachhaeus సంగీతం, సుతపల్లి రామ లక్ష్మీ లిరిక్స్ అందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.టీం సభ్యులకి మంచి పేరు రావాలి అని, సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నిర్మాత & డైరెక్టర్ MK సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మా సినిమా 1స్ట్ లుక్ ని , కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో మైతాలజీ జోనర్ లో కాన్సెప్ట్ ఉండబోతుంది.

మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం. సాంగ్స్ & నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Related Articles

Latest Articles