“మిరాయ్” తేజ సజ్జ విజువల్ వండర్

యంగ్ హీరో తేజ సజ్జ, హనుమాన్ విజయం తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. పరిమిత బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ గూస్‌బంప్స్ ఇస్తోంది. తొమ్మిది శక్తివంతమైన గ్రంథాల కోసం హీరో, విలన్ మధ్య జరిగే పోరాటం చిత్ర కథాంశం. ముఖ్యంగా ట్రైలర్ చివరలో శ్రీరాముడి షాట్ అదిరిపోయింది. మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సెప్టెంబర్ 12న విడుదలవుతోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు, డిమాండ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.

Related Articles

Latest Articles