
నిఖిల్ భట్ తన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’తో సంచలనం సృష్టించాడు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రం, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నిఖిల్ యూనివర్సల్ స్టూడియోస్‌తో కలిసి హాలీవుడ్‌లో తొలి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటులు నటించనున్నారని, ప్రస్తుతం వారి పేర్లు చర్చలో ఉన్నాయని సమాచారం. 2026లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అదే సమయంలో, నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని మురాద్ ఖేతానీతో ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాడు.


