అల్లు అరవింద్ కుటుంబానికి మోహన్ బాబు పరామర్శ

నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా డా. మంచు మోహన్ బాబు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లను, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. అల్లు ఫ్యామిలీతో కొంత సమయం గడిపి వారికి భరోసాని ఇచ్చారు.

గతంలో మంచు మోహన్ బాబు, అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత అల్లు అరవింద్‌తో అంతే అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో అల్లు కనకరత్నమ్మ మరణంపై ఆయన ఎమోషనల్ అయి అల్లు ఫ్యామిలీతో అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

Related Articles

Latest Articles