
యంగ్ ఛార్మింగ్ హీరో సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా, కె.వి నరసింహ రాజు సమర్పకులుగా, నిర్మాత కుశాల్ రాజు, దర్శకుడు సంగ కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ‘రోహిణి’ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాటలు, ట్రైలర్‌ను ఆవిష్కరించిన ముఖ్య అతిథులు టీఎఫ్‌సీసీ అధ్యక్షులు దామోదర ప్రసాద్, నిర్మాత చదలవడ శ్రీనివాస్, త్రినేత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్
పరమేశ్వరి మడపటి, హీరో కృష్ణసాయి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవడ శ్రీనివాస్ ట్రైలర్ లాంచ్ చేసి మాట్లాడుతూ… “స్టామినా ఉన్న హీరో సన్నీ కునాల్ తప్పకుండా సక్సెస్ సాధిస్తాడు. రూపంలోనూ నటనలోనూ ఆకట్టుకున్న సన్నీ కునాల్ కు ఆల్ ది బెస్ట్. చిన్న సినిమాలు సక్సెస్ అయితే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. మంచి సబ్జెక్ట్‌తో తెరకెక్కిన రోహిణి సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాత కుశాల్ రాజు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
టీఎఫ్‌సీసీ సెక్రటరీ, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ… “ హీరో సన్నీ కునాల్ కు మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడతాడు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా విజయవంతం అవుతుంది. ఇటీవల హిట్ అయిన ‘లిటిల్ హార్ట్స్’ లాగే , రోహిణి కూడా హిట్ అయి, కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసిన నిర్మాత కుశాల్ రాజుకు డబ్బులు రావాలి .” అన్నారు.
దర్శకుడు సంగ కుమార్ మాట్లాడుతూ… “ఈ సినిమా విజయవంతం కావడానికి యూనిట్‌లో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ముఖ్యంగా డాక్టర్ రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమా కు బలం. పాటలకు వస్తున్న స్పందన సంతోషంగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నాను” అన్నారు.
నిర్మాత కుశాల్ రాజు మాట్లాడుతూ… “ఒక మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో పని చేశాం. దర్శకుడు సంఘ కుమార్ అందించిన కొరియోగ్రఫీ ఫైట్స్ అదుర్స్.
కెమెరామెన్ అభినయ్ ప్రతిభ రోహిణి సినిమాకు హైలైట్. అందుకే సినిమా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల చేసే మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాము ” అన్నారు.
హీరో సన్నీ కునాల్… “మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టానికి తగిన ఫలితం రావాలి. ప్రేక్షకులు నచ్చే సస్పెన్స్, మెచ్చే రొమాన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలు రోహిణి లో చాలా ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ కావాలి. సినిమాను సూపర్ హిట్ చేయండి. ” అన్నారు.
హీరోయిన్లు దేవిక సాహూ, ఆశ మాట్లాడుతూ… “పాటలు బాగుంటే సినిమా హిట్ అవుతుంది. రోహిణి పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కుశాల్ రాజు కు
దర్శకులు సంఘ కుమార్ కు ధన్యవాదాలు” అన్నారు.
లిరిక్ రైటర్ డాక్టర్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ… “ఈ సినిమాకు సింగల్ కార్డు తో పాటలు రాసే అవకాశం ఇచ్చిన మిత్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లికి కృతజ్ఞతలు. పాత సినిమాల మాదిరిగా మధురమైన సాహిత్యంతో రాశాను. పాటలు అందరికీ నచ్చుతాయి ” అన్నారు.
ప్రముఖ కవి, రచయిత, కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి వెంకటరమణ ఈ చిత్రంలోని అన్ని పాటలు రాయగా, సంగీతాన్ని ఆనంద్ అందించారు.
“ నవరసాలు పలికించిన డాక్టర్ దాసరి వెంకటరమణ పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉన్నాయి. మా ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్యానర్ పై వస్తున్న రోహిణి చిత్రం కుశాల్ అండ్ కునాల్ కు మంచి పేరు తీసుకువస్తుంది. ” అని సమర్పకులు కెవి నరసింహ రాజు తెలిపారు.
” పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న రోహిణి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.” సినీ ప్రముఖులు రఘు బత్తుల, సినీ రచయిత డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు, నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి, దర్శకులు సింహ శ్రీ మిద్దె, బిల్డర్స్ యువ రాజు, కృష్ణ, పోలీస్ అధికారులు రాజా, రవి తదితరులు రోహిణి ఆడియో వేడుకలో పాల్గొన్నారు.
సాంకేతిక బృందం:
మాటలు: మెండెమ్ శ్రీధర్
కెమెరా: అభినయ్ సంగ
కో ప్రొడ్యూసర్: దేవకి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షేక్ వలీ పాషా
అసోసియేట్ రైటర్:
అక్బర్ చక్రవర్తి
కో రైటర్స్:
మధురిమ, ప్రియ, ముత్యాల సరాలు, జి. హరి ప్రసాద్, బోయినపల్లి రమణా రావు,
కే. కే.
PRO: కడలి రాంబాబు, దయ్యాల అశోక్
పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి


