అనుమతి లేకుండా తన ఫొటోలు వాడొద్దు అంటున్న ఐశ్వర్య

ఫొటోలు, వీడియోలను చట్టవిరుద్ధంగా వాడుతున్నారని నటి ఐశ్వర్య రాయ్ దిల్లీ హైకోర్టును మంగళవారం ఆశ్రయించారు. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తిచేశారు. కొందరు గుర్తుతెలి యని వ్యక్తులు తనపేరు, చిత్రాలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్లో అనధికారికంగా వాడుతున్నా రని, వాటిని ఉపయెగించకుండా నిరోధించాలని కోరారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల వీడియోలు, అసభ్య చిత్రాలను సృష్టిస్తున్నారని,స్వలాభం కోసం వాటిని వినియోగిస్తు న్నారని పిటిషన్ లో ఐశ్వర్య పేర్కొ న్నారు. “పూర్తిగా అసత్య సన్నిహిత ఫొటోలు ఇంటర్నెట్లో ప్రచారం అవు తున్నాయి. సమ్మతి లేకుండా ఆమె ఫొటోలు, పేరు వాడుకునే హక్కు ఎవ రికీ లేదు. ఓ వ్యక్తి ఆమె పేరు, ఫొటో లతో డబ్బు వసూలు చేస్తున్నాడు. ఆమె పేరును, రూపాన్ని వారి ఇష్టానుసారం వాడటం దురదృష్ట కరం” అని నటి తరపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ వాదించారు. తీరు మార్చుకోకపోతే ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సి వస్తుందని జస్టిస్ తేజస్ కరియా పేర్కొన్నారు. 2026 జనవరి 15న కేసు విచారణ చేపడతామన్నారు.

Related Articles

Latest Articles