‘ఓజి’ చిత్ర రివ్యూ

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుజిత్ రచనా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ తో జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓజి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించగా రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పని చేశారు. నవీన్ నులి ఎడిటింగ్ చేయగా దానయ్య, కళ్యాణ్ దాసరి చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
జపాన్ నుండి వెనక్కి తిరిగి వచ్చిన భారతీయులలో కొంతమంది ముంబైలో ఒక పోర్టు నిర్మించి తద్వారా మరి కొంతమందికి జీవన ఆధారంగా ఈ పోర్టు నిలిచేలా వ్యాపారం చేస్తారు. అయితే ఆ పోర్టు కోసం మొదలైన పోరులో ఎన్నో మలుపులు వస్తాయి. చివరికి ఈ పోరు పోర్టుతో ముగుస్తుందా లేక మరింత ముందుకు వెళ్తుందా? అసలు ఓజెస్ గంభీరకు, ఈ పోర్టుకు ఉన్న సంబంధం ఏంటి? ముంబైని విడిచి వెళ్లిన గంభీర తిరిగి ముంబైకి రావడానికి కారణం ఏంటి? చివరికి గంభీర ఏమవుతాడు? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఓజీ సినిమా చూడాల్సిందే.

నటీనటులు నటన :
సినిమాలో ఓజస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా తీసింది ఒక అభిమాని కాబట్టి అభిమానులకు ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ నచ్చుతారో అదే విధంగా పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ నటనతో తాండవం ఆడినట్లు అర్థమవుతుంది. ఓజస్ గంభీర అనే పాత్ర పవన్ కళ్యాణ్ అభిమానులకు జీవితకాలం ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు.

కమ్మని అనే పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ చాలా చక్కగా నటించారు. వెండితెరపై మనకు కనిపించే సమయం తక్కువ అయినప్పటికీ తనదైన పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హోమ్లీ లుక్ తో అభిమానుల మనసును దోచుకున్నారు.

సత్య దాదా పాత్రలో ప్రకాష్ రాజ్ యధావిధిగా ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఒక సెటిల్డ్ పాత్రలో చిత్రానికి బోనస్ గా నిలిచారు.

ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో ఓమిగా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారు. తన స్టైలిష్ వింటేజ్ లుక్కుతో ఇమ్రాన్ పవన్ కళ్యాణ్ కు దీటుగా పెర్ఫార్మన్స్ ఇస్తూ మంచి పోటీ ఇచ్చారు.

శ్రేయ రెడ్డి ఎంతో పవర్ఫుల్ పాత్రలో చిత్రమంతటా ప్రేక్షకులను మెప్పించారు. అర్జున్ దాస్ తన క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినట్లు అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు.

చిత్రంలోని ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో చాలా అద్భుతంగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినటువంటి సుజిత్ చిత్రానికి రచన దర్శకత్వం చేయడంతో ప్రేక్షకులకు అభిమానులకు పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో ఎంతో క్లారిటీతో తాను రాసుకున్న కథను వెండితెరపై ప్రేక్షకులకు చూపించడంలో సుజిత్ తారాస్థాయిలో విజయం సాధించారు. ఫ్యాన్స్ కు నచ్చినట్లు పవన్ సినీకెరియర్ అంతటిలోనూ గుర్తుండిపోయే విధంగా ఉన్నత స్థాయిలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం బయటకు తీసి చూపించారు. తిట్టడానికి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు బోనస్గా నిలిచాయి. ముఖ్యంగా తమన్ ఎలివేషన్ సీన్లకు ఇచ్చిన బిజిఎం అలాగే హంగిడిచేత పాట సినిమాను మరో స్థాయికి చేరేందుకు సహాయపడింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఎంతో అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్ గ్రౌండ్, కలరింగ్, డిఐ, ఎఫెక్ట్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు అన్నీ చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తూ అద్భుతమైన నిర్మాణ విలువలతో చిత్రాన్ని వెండితెరపై తీసుకురావడంలో చిత్ర సాంకేతిక బృందమంతా విజయం సాధించింది.

చిత్ర విశ్లేషణ :
సినిమా జపాన్ లో మొదలై ముంబైలో గ్యాంగ్స్టర్స్ ఇంకా గ్యాంగ్ వార్ల మధ్య తిరుగుతూ చివరికి ముంబై మహా నగరాన్ని కాపాడే ప్రయాణంలో అక్కడక్కడ కొంచెం స్లో అయినప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులను, అభిమానులను సాటిస్ఫై చేస్తూ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నిలుస్తూ వెండితెరపై చిత్రం విజయతాండవంగా నిలిచింది.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, బిజిఎం మొదలైనవి.

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.

సారాంశం :
ప్రేక్షకులకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ కన్నుల పండుగగా నిలిచే చిత్రం ఓజి.

Related Articles

Latest Articles