తమిళనాడు కరూర్‌ తొక్కిసలాట పై స్పందించిన మెగాస్టార్

తమిళనాడు కరూర్‌లో శనివారం తమిళ హీరో విజయ్ పార్టీ తరఫున నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట కారణంగా కొందరు చ‌నిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి 🙏” అని పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో రాజకీయ సభల్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది.

https://x.com/kchirutweets/status/1972141946388074701?s=46

Related Articles

Latest Articles