
సుడిగాలి సుధీర్ గా ప్రసిద్ధి చెందిన సుధీర్ ఆనంద్ తన కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, వజ్ర వరాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మాణంలో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ డ్రామా, సుధీర్‌కు ఐదవ చిత్రంగా నిలుస్తుంది. ఇటీవల ‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన శివాజీ విలన్‌గా నటిస్తున్నారు.
‘హైలెస్సొ’ టైటిల్ గ్రామీణ భాషలో సాధారణంగా వాడే మాట నుంచి తీసుకున్నారు. టైటిల్ పోస్టర్‌లో బంగారు పాయలు ధరించిన ఆడపాదం, ఆకుపై కోడి, మేక తలలతో కూడిన అన్నం, పూలు, కుంకుమ, రక్తంతో తడిసిన కత్తి ఉండటం మిస్టీరియస్‌గా ఉంది. ఇది దైవిక శక్తి, సంఘర్షణలను సూచిస్తుంది.
ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రంలో హీరో నిఖిల్ టైటిల్ విడుదల చేయగా, బన్నీ వాసు స్క్రిప్ట్ అందజేశారు. డైరెక్టర్లు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేష్ కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. ప్రసన్న కుమార్ స్వయంగా యాక్షన్ అన్నారు.
నటాషా సింగ్, నక్షా శరణ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అక్షరా గౌడ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మొత్త రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవరా దుహితా శరణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక బృందం: అనుదీప్ దేవ్ సంగీతం, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చింతా శ్రీనివాస్ రచన. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.


