
విష్ణు విశాల్ స్టూడియోజ్ ఆధ్వర్యంలో శుభ్రా & ఆర్యన్ రమేష్‌తో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ చిత్రం, ప్రవీణ్ కె దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ డార్క్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో విష్ణు విశాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈరోజు విడుదలైన టీజర్, భయానక హత్య కేసు దర్యాప్తును పరిచయం చేస్తూ విష్ణు విశాల్‌ను కొత్త రూపంలో చూపిస్తోంది. 34 నెలల విరామం తర్వాత సోలో హీరోగా తిరిగి వస్తున్న విష్ణు, మరోసారి పోలీస్ అధికారిగా కనిపిస్తారు.
సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాలా పార్వతి, అవినాశ్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మను ఆనంద్ (FIR దర్శకుడు) సహ రచయితగా పనిచేసిన ఈ చిత్రం, అక్టోబర్ 31న తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఘిబ్రాన్ సంగీతం, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, సాన్ లోకేష్ ఎడిటింగ్, స్టంట్ సిల్వా & పిసి స్టంట్స్ ప్రభు యాక్షన్ వంటి సాంకేతిక బృందం రూపొందించింది.ట్రైలర్, సంగీత విడుదల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.


