
దుష్ట శిక్షణ… శిష్ట రక్షణగావించే శక్తి స్వరూపిణిని నిష్టతో, భక్తిశ్రద్ధలతో కొలిచే శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయి. నవరాత్రుల వేళ తెలంగాణలో బతుకమ్మ వేడుకలతో, ఆంధ్ర ప్రదేశ్ లో ఊరూరా జరుగుతున్న దుర్గాదేవి పూజలు, భవానీ దీక్షలతో ఈ దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించకున్నాయి. ఈ విజయ దశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం- సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తూ మరింత జనరంజక పాలన సాగిస్తుందని మనవి చేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి


