హీట్ లేపుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ రాజకీయ వ్యాఖ్యలు

అర్జున్ రెడ్డి, ఇంటింట రామాయణం ఫేమ్ నటుడు రాహుల్ రామకృష్ణ రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ రేపుతున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ఎక్స్ వేదికగా ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై రాహుల్ రామకృష్ణ ఈ విధంగా కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయామని, హైదరాబాద్ నగరం నాశనం అయిపోయిందని ఆయన అన్నారు. అలాగే ప్రజలు కేసీఆర్, కేటీఆర్ పాలనను కోరుకుంటున్నారని, త్వరగా మీరు అధికారంలోకి రండి లేదా నన్ను చంపేయండి అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్నాయి. కాగా ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ ఎక్స్ అకౌంట్ కనుమరుగయింది.

Related Articles

Latest Articles