
శ్రావణ్ కుమార్ రాందిని హీరోగా పరిచయం చేస్తూ హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ ప్రొడక్షన్ నెం.1 గా VIP ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగ వ్యాస్ డైరెక్టర్ గా మారుతున్నారు. డా. చింతాడ హేమారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ అతిథిగా హాజరై కెమెరా స్విచ్ఛాన్ చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు, భాజపా ఏపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు స్క్రిప్ట్ అందించారు. సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
నటీనటులు – శ్రావణ్ కుమార్ రాంది, సుమంత్ మక్కా, జీవన్ జాస్ఫర్, తదితరులు
టెక్నికల్ టీమ్
లైన్ ప్రొడ్యూసర్ – కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – లాలం కన్నాజీ
కాస్ట్యూమ్స్ – హర్షిత కూచిమంచి
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రొప్ప గోపీకృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ కృష్ణ
ప్రమోషన్స్, లొకేషన్స్ ఆఫీసర్ – సనపల చినబాబు
బ్యానర్ – హై జాయ్ కమర్షియల్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – నాగ వ్యాస్


