
యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్, లవ్ టుడే మరియు డ్రాగన్ వంటి వరుస హిట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినవాడు, ఈ దీపావళికి తన రాబోయే పాన్-ఇండియా చిత్రం ‘డ్యూడ్’తో మరోసారి మనల్ని మెప్పించనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వంలో, ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ప్రేమలు సంచలనం మమితా బైజు నటిస్తున్నారు. ఇది ఉత్సాహవంతమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లో భాగంగా, మూడో సింగిల్ ‘సింగరి’ విడుదలైంది. సాయి అభ్యంకర్ స్వరసారథ్యంలో, ఆయనే గానం చేసిన ఈ పాట ఫన్‌తో కూడిన హై-ఎనర్జీ ట్రాక్. రమజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎలక్ట్రానిక్ బీట్స్, యువతరాన్ని ఆకట్టుకునే క్విర్కీ లైన్స్‌తో ఇన్‌స్టంట్ మెమరబుల్ వైబ్‌ను అందిస్తోంది. మహిళా గాయకుల బృందం అదనపు ఫ్లేవర్ ఇచ్చింది.
విజువల్స్‌లో ప్రదీప్ ఇమ్పెకబుల్ కామిక్ టైమింగ్‌తో లైట్‌హార్టెడ్ సీన్స్‌లో మెరుస్తున్నాడు. ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్‌లో సాయి అభ్యంకర్ డెబ్యూ చేస్తున్న ఈ పాట, భాషలకు అతీతంగా యువతలో రెసొనేట్ చేసి చార్ట్‌బస్టర్‌గా మారే అవకాశం ఉంది.
టెక్నికల్‌గా కూడా డ్యూడ్ బలమైన టీమ్‌తో రూపొందింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, బరత్ విక్రమన్ ఎడిటింగ్, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానున్న డ్యూడ్, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాన్స్, కామెడీ, మ్యూజిక్‌తో కలర్‌ఫుల్ సెలబ్రేషన్‌గా ఉండనుంది.
కాస్ట్: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమితా బైజు, రోహిణి మొల్లేటి, హృదు హరూణ్, డ్రావిడ్ సెల్వం & ఇతరులు.
టెక్నికల్ క్రూ:
రచన & దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యర్నేని, వై. రవిశంకర్
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: బరత్ విక్రమన్
తమిళ పీఆర్ఓ: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో


