
మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రుద్ర అనే పేరు కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది. అయితే టైటిల్ ఏదైనా కూడా క్యాప్షన్ మాత్రం కింగ్ ఆఫ్ శరంగేటి అని కరమైనట్లు సినీ వర్గాలలో బలంగా వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఈ చిత్రంకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు టైటిల్ కూడా అలాగే లీక్ అవుతూ ప్రచారం అవుతున్న ఈ వార్తలు సినిమాకు ప్లస్ గా మారతాయా లేదా మైనస్ గా మారుతాయి అన్నది వేచి చూడాల్సిందే. నవంబర్ 16న టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మహేశ్, ప్రియాంక షూట్ పూర్తయిందని.. VFX వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన మహేష్ బాబు ధరించే లాకెట్ ఎంతో వైరల్గా పడింది. నంది, రుద్రాక్ష, డమరుకం, త్రిశూలం, మూడు నామాలతో కూడిన ఈ లాకెట్ ఇప్పటికే మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టిస్తుంది.


