ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న “ఒక మనసు”

నాగ శౌర్య, నీహారిక కొణిదెల జంటగా నటించిన మ్యూజికల్ లవ్ స్టోరీ “ఒక మనసు” ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. లవ్ స్టోరీస్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఈటీవీ విన్ వేదికగా అలరిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు రామరాజు రూపొందించారు. ప్రేమకథా చిత్రాల్ని రూపొందించడంలో తన ప్రత్యేకతను ఒక మనసు సినిమాతో దర్శకుడు రామరాజు మరోసారి చూపించారు. తొలిప్రేమ ప్రేమికులపై వేసే గాఢముద్ర ఎలాంటిదో చూపించిందీ మూవీ. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన “ఒక మనసు” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా మూవీ లవర్స్ కు మరింత చేరువకానుంది. ఈ సినిమాతో నీహారిక హీరోయిన్ గా ఆడియెన్స్ కు పరిచయమైంది. మెగా ఫ్యామిలీ నుంచి నాయికగా ఒక మనసు సినిమాతో అడుగుపెట్టిన నీహారిక తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, ప్రగతి, ఆర్జే హేమంత్ నటించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలోని ఓ మనసా, నిన్న లేనంత..వంటి సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ వింటూనే ఉన్నారు. ఈ సినిమాలోని హార్ట్ టచింగ్ డైలాగ్స్ కూడా చాలా పాపులర్. ఎన్నిసార్లు చెప్పమన్నా చెబుతాను, నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు వంటి డైలాగ్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూసినా కనిపిస్తాయి. రాజకీయాల్లోకి రావాలనుకునే సూర్య పాత్రలో నాగశౌర్య, మెడిసిన్ చదివే స్టూడెంట్ సంధ్య క్యారెక్టర్ లో నీహారిక బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు.

Related Articles

Latest Articles