
యువ కథానాయకుడు సాయిదుర్గ తేజ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్ కి ఉంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ప్రతి దశలో ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన యువకుడు. వర్తమాన అంశాలపై స్పందిస్తూ… రహదారి భద్రత, సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై చైతన్యపరుస్తున్నాడు. సాయిదుర్గ తేజ్ కథానాయకుడిగా విజయాలు అందుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకొంటున్నాను.


