
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ జంటగా వచ్చిన సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సాయికుమార్, బలగం మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, కిరాక్ సీత, వికే నరేష్, కామ్నా జట్మాల్ని తదితరులు కీలకపాత్రలో పోషించారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా నేడు ప్రత్యేకతలు ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఎంతో ధనవంతుడు అయినటువంటి ఒక యువకుడు చాలా చిల్లరగా ప్రవర్తిస్తూ జీవితాన్ని జాలీగా ఎంజాయ్ చేస్తూ కేరళలోని ఒక కాలేజీలో చదువుకుంటానికి వెళ్తాడు. అక్కడ తన జీవితంలోకి కాస్త మెంటల్ స్టెబిలిటీ లేని అమ్మాయి వస్తుంది. అసలు స్టెబిలిటీ లేని ఈ అబ్బాయి జీవితంలో చిన్న విషయానికి కూడా హర్ట్ అయ్యే ఆ అమ్మాయి రావడంతో వారి జీవితాలు ఏ విధంగా మలుపులు పెరుగుతాయి? వారు ఎలా ప్రేమలో పడతారు? ఆ ప్రేమ ఎలా సాగుతుంది? చివరికి వారు కలుస్తారా లేదా విడిపోతారా? ఆ యువతీ యువకులు మారతారా లేదా? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
కుమార్ అబ్బవరం పాత్రలో కిరణ్ అభవరం తనదైన మాస్ స్టైల్ లో యువతకు ఎంతో అర్థమయ్యే విధంగా సెటిల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను తారా స్థాయిలో తృప్తి పరిచాడు. తనదైన శైలిలో ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకులు ఎంతో ఎంటర్టైన్ అయ్యేవిధంగా నటించారు. మెర్సీ జాయ్ పాత్రలో వ్యక్తితరేజా ప్రేక్షకులను ముగ్ధులను చేశారు. అటు పరఫార్మన్స్ అలాగే ఇటు అందం లో ఎంతో బ్యాలెన్సర్గా ఉన్నారు. తన పాత్ర విషయానికి వస్తే ఒక వైపు నుండి సాఫ్ట్ గా అలాగే మన వైపు నుండి కాస్త సైక్ గా కనిపిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. సాయికుమార్ అలాగే వీకే నరేష్ గారు తమ తమ పాత్రల పరిధిలో ప్రేక్షకులను అటు సెంటిమెంట్గా అలాగే ఎంటర్టైన్ చేస్తూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్, కామ్నా జట్మాల్ని వెండి ధరపై కనిపించిన తక్కువ సమయమైనప్పటికీ సినిమా అంతట మంచి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందేలా చేశారు. కిరాక్ సీత సినిమా అంతటా కనిపిస్తూ తన పాత పరిధిలో తను పర్ఫాం చేశారు. అలాగే సినిమాలోని ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రలో పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బోనస్గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
జేమ్స్ నాని తాను రాసుకున్న కథను ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ అయ్యే విధంగా రీచ్ అయ్యేలా విజయం సాధించారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఒకే ఒక్క మొటివితో మంచి కథను వెండి ధర పైకి తీసుకొచ్చి అందరిని ఎంతగానో అలరించారు. సినిమాలోని పాటలు ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్, డిఐ అలాగే ఇతర సాంకేతిక విషయాలు ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా కేరళ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా ఇటీవల కాలంలో తెలుగులో రాకపోవడంతో ఒక పూర్తి ఎంటర్టైనింగ్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటీనటుల నటన, కేరళ బ్యాక్ గ్రౌండ్.
మైనస్ పాయింట్స్ :
రెండవ భాగంలో అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.
సారాంశం :
కుటుంబ సమేతంగా వెళ్లి అంతా కలిసి నవ్వుకుంటూ ఎక్కడ ఇబ్బంది పడకుండా పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చూసే చిత్రం కె ర్యాంప్.


