
తిరుమల శ్రీవారిని సినీ నటుడు తేజ సజ్జా దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘మిరాయి’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి తేజ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తేజ నటించిన ‘మిరాయి’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిటాక్ సొంతం చేసుకుంది.


