
అక్కినేని నాగార్జున 100వ చిత్రానికి సంగీతాన్ని అందించేందుకు దేవిశ్రీ ప్రసాద్ సిద్ధమయ్యారు. తనకు 19 సంవత్సరాల వయసులో నాగార్జున మన్మధుడు చిత్రానికి దేవి సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత మాస్, కింగ్, డమరుకం, భాయ్ వంటి ఎన్నో చిత్రాలకు తన సంగీతాన్ని అందించి ఎంతో మంచి ఆల్బమ్స్ అక్కినేని అభిమానులకు అందించడం జరిగింది. అయితే సుమారు 13 సంవత్సరాల తర్వాత నాగార్జున 100వ చిత్రానికి మరోసారి దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని అందించనున్నారు. ఎంతో గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మ్యూజిక్ ఆల్బమ్ వస్తుందని అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


