
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మాణంలో, జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్ కామెడీ చిత్రం “సిగ్మా” షూటింగ్ 65 రోజుల్లో 95% పూర్తయింది. నాలుగు నెలల్లో ఈ మైలురాయి సాధించిన ఈ సినిమా టైటిల్ ‘సిగ్మా’గా ఖరారైంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. డబ్బు, బంగారం స్టాక్‌ల మధ్య తీవ్రమైన పోజ్‌లో సందీప్ కిషన్ కనిపిస్తున్నారు, ఇది ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌ను సూచిస్తుంది.
ఈ సినిమా కథ సమాజ నిబంధనలను తిరస్కరించి, స్వతంత్రంగా లక్ష్యాలను సాధించే ‘సిగ్మా’ అనే ఒంటరి తోడేలు కథ. ట్రెజర్ హంట్, క్రిమినల్ హైస్ట్ ఎలిమెంట్స్‌తో యాక్షన్, అడ్వెంచర్, కామెడీ మిక్స్‌తో రూపొందుతోంది. సందీప్ కిషన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అంబు తసన్, యోగ్ జపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుధర్శనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని సర్‌ప్రైజ్ క్యామియోలు కూడా ఉన్నాయి.
లైకా ప్రొడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, “జాసన్ సంజయ్ తన రచనను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. బడ్జెట్‌లో, సమయానికి పూర్తి చేయడం అరుదైన విషయం. మేము ఆయన్ను డైరెక్టర్‌గా పరిచయం చేయడం గర్వంగా ఉంది” అన్నారు.
దర్శకుడు జాసన్ సంజయ్ మాట్లాడుతూ, “సిగ్మా టైటిల్ స్వతంత్ర స్ఫూర్తిని సూచిస్తుంది. తమన్ సంగీతం, సందీప్ యాక్షన్, లైకా గ్రాండ్ ప్రొడక్షన్‌తో సినిమా అద్భుతంగా రూపొందుతోంది. ఒక్క పాట మాత్రమే మిగిలింది, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎర్లీ సమ్మర్ రిలీజ్ లక్ష్యం” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్, ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ డైరెక్టర్ బెంజమిన్ ఎం. టెక్నికల్ టీమ్‌గా పని చేస్తున్నారు. చెన్నై, సేలం, తలకోనా, థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరిగింది. తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ యూత్‌ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.


