“సంతాన ప్రాప్తిరస్తు” చిత్ర రివ్యూ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించగా మహిరెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ , అభినవ్ గోమటం, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :

సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఒక యువకునికి (విక్రాంత్) ఒక అమ్మాయిని (చాందిని) ఇష్టపడి ప్రేమిస్తాడు. కాని ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్) ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. తన తండ్రికి ఇష్టం లేకపోయినా అతడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే 100 రోజుల్లో తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతాను అని హీరోయిన్ తండ్రి హీరోతో ఛాలెంజ్ చేయగా ఆ 100 రోజుల్లో వారికి సంతానం కలుగుతుంది అని తెలిస్తే అంత సర్దుకుంటుంది అనే ఉద్దేశంతో ఆ జంట పిల్లల్ని కోరుకుంటారు. కాకపోతే అతనికి ఉన్న ఆరోగ్య సమస్య వల్ల వారికి సంతానం కలగటంలో కష్టం అవుతుంది. ఆయితే వారు సంతానం కలగడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? ఆ ప్రయత్నాలలో వారికి వచ్చే ఛాలెంజ్ లు ఎలా ఉంటాయి? ఆ ప్రయాణంలో సమాజంలో ఎవరు ఏం అనుకుంటారు అని వారు పడే ఇబ్బందులు ఏంటి? చిత్రంలోని పలు పాత్రల వల్ల వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? చివరికి వారికి సంతానం కలుగుతుందా లేదా? ఆమె తండ్రి తాను అన్నట్లు తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :

చిత్రంలో హీరో పాత్ర పోషించిన విక్రాంత్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా కనిపించారు. అటు ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా మాత్రమే కాకుండా ఇటు తన పర్సనల్ లైఫ్ లోని భర్త పాత్ర కూడా చాలా అందంగా నటించారు. సరదాగా లభిస్తూనే అమాయకంగా అలాగే ఎమోషనల్ పండిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్గా నటించిన చాందిని చౌదరి తండ్రి, భర్త ప్రేమానురాగాలను పంచుకుంటూ వారి మధ్య నలిగిపోతూ కనిపిస్తూ ప్రతి ఎమోషన్ తన స్కిల్స్ తో పాటు తన కళ్ళతో కూడా నటించడం ప్రత్యేకం. కాస్త తెలంగాణ యాస తలకు సూటైనట్టు అనిపించినప్పటికీ తన వంతు ప్రయత్నం తాను చేశారు. మురళీధర్ గౌడ్ పాత్ర చిత్రంలో ప్రేక్షకులకు కాస్త కోపం తెప్పించినప్పటికీ ఒక తండ్రి స్థానంలోని వ్యక్తి అలాగే ఆలోచిస్తాడంటూ ఎంతో కన్విన్సింగ్ గా అనిపించింది. అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ పాత్రలు చిత్రంలో ఎంతో కీలకంగా కనిపించాయి. వారు తలపై కనిపించినంత సేపు వెండితెరపై ఫన్నీగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ పాత్ర తక్కువగానే ఉన్నప్పటికీ సినిమాకు మంచి ఇంపాక్ట్ చూపించింది. అలాగే చిత్రంలోని పలు పాత్రలు తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత ప్లస్గా నిలిచాయి.

సాంకేతిక విశ్లేషణ :

దర్శకుడు సంజీవరెడ్డి రాసుకున్న కథ సాధారణంగా సమాజంలో కనిపిస్తూ ఉండే సమస్య కావడంవల్ల ఈ కథను ప్రేక్షకులు చాలా త్వరగా అర్థం చేసుకునేలా ఉంది. అయితే ఎంతో సెన్సిటివ్ కథను తెరపై ప్రేక్షకులకు కన్విన్స్ అయ్యేవిధంగా తీయడం ఎంతో ఛాలెంజింగ్ విషయం. దర్శకుడు ఆ ఛాలెంజ్ను అధిరోహించి తన దర్శకత్వంతో సినిమాను అద్భుతంగా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కాస్త సరదాను కలిపి వెండితెరపై చూపించారు. తెరపై సినిమా క్వాలిటీ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాట్ బస్టర్ గా మారి సినిమాకు మరింత బోనస్ గా నిలిచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఆర్ఆర్ సిచువేషన్ కు తగ్గట్లు అద్భుతంగా సెట్ అయింది. లొకేషన్స్ వరంగల్ ఇంకా వైజాగ్ లో చాలా వరకు న్యాచురల్ గా అందంగా కనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించడం లేదు.

చిత్ర విశ్లేషణ :

ప్రస్తుతం సమాజంలో కనిపించే ఒక సెన్సిటివ్ విషయం మరింతో సెన్సిటివ్గా డీల్ చేశారు. సినిమా రెండవ భాగంలో కాస్త స్లోగా అనిపించినప్పటికీ సినిమాలోని సెన్సిటివ్ విషయం కాబట్టి అటు ఎమోషనల్ గా వర్కౌట్ అవడంతో ప్రేక్షకులకు ఎంతో కన్వెన్సింగ్ గా అనిపించింది. సినిమాలోని కొన్ని విషయాలు ఇంకా సలహాలు ప్రేక్షకులు ఫాలో అయ్యే విధంగా ఉండటంతో ఈ చిత్రం ద్వారా కాస్త నాలెడ్జ్ కూడా పొందవచ్చు అని తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ, దర్శకత్వం, పాటలు, నటీనటుల నటన, కామెడీ, నిర్మాణ విలువలు.

మైనస్ పాయింట్స్ :

రెండవ భాగం కాస్త స్లోగా అనిపించడం, చాందిని చౌదరి తెలంగాణ యాస.

సారాంశం :

ఒక సమస్యను అందరికీ అర్థమయ్యేలా అలాగే అందరూ యాక్సెప్ట్ చేసేలా తీసిన ఈ సినిమా ఎంతో అవగాహనతో కుటుంబంతో కలిసి చూసే విధంగా సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ఉంది.

Related Articles

Latest Articles