
ఖుషి టాకీస్ బ్యానర్ పై రాఖీ శర్మ. రోజా భారతి జంటగా నటిస్తూ దేవేందర్ దర్శకత్వంలో రోజా భారతి నిర్మాతగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం సీతా ప్రయాణం కృష్ణతో. ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందించగా రవీంద్ర సినిమాటోగ్రఫీ చేశారు. దినేష్, సుమంత్, అనుపమ తదితరులు చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
కొత్తగా పెళ్లయిన ఒక జంట ఊరు నుండి సిటీకు వచ్చి స్థిరపడతారు. వారికి సాయంగా ఊరి నుండి పనిమనిషి కూడా వస్తారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న యువకుడికి తన భార్య మోడ్రన్ గా, స్లిమ్ గా, ఇంకా మరికొన్ని అంచనాలతో ఉండాలని అనుకుంటాడు. తన భార్య చాలా సాధారణంగా ఆరోగ్యంగా భర్తను అర్థం చేసుకుంటూ ఉండే నేపథ్యంలో ఉంటుంది. అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అతనికి తన ఆఫీసులో ఒక మోడ్రన్ అమ్మాయి పరిచయం అవుతుంది కానీ అతని బాస్ కూడా ఆ అమ్మాయిని ఇష్టపడతారు. దానితో ఈ నూతన భార్యాభర్తల మధ్య వారి వల్ల ఏమైనా భేదాలు వస్తాయా లేదా? ఆ మోడరన్ అమ్మాయి ఇంకా ఆ యువకుడు మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది? దానివల్ల తన బాస్ తో ఏమైనా ఛాలెంజ్లు వస్తాయా? చివరికి వారి జీవితాలు ఎలా ఉండబోతాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
కొత్త నటీనటులు అయినప్పటికీ శర్మ ఇంకా రోజాభారతి ఇద్దరు పోటాపోటీగా సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేస్తూ నటిస్తూ కాకుండా ఒక నూతన జంట వలే జీవించారు చెప్పుకోవచ్చు. అటు ఎమోషన్స్ అలాగే ఇటు ఇతర ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ మాక్సిమం కవర్ చేస్తూ తమ పాత్రలు చిత్రంలో ఎంతో బాగా పోషించారు. అలాగే అనుపమ పనిమనిషి పాత్రలో ఎంటర్టైన్ చేస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బోనస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈమధ్య కాలంలో ఎంతో సాధారణంగా చూస్తున్న ఒక ఇన్సిడెంట్ ను తీసుకుని నూతన జంట మధ్య జరిగే కథగా దర్శకుడు తీసుకొని దానిని ప్రేక్షకుల కళ్ళముందు చూపించడంలో సక్సెస్ అయ్యారు. పిక్చర్ క్వాలిటీ కాస్త తక్కువగా అనిపించినప్పటికీ విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి. డబ్బింగ్లో అక్కడక్కడ తప్పిదాలు జరిగినప్పటికీ సినిమా హాఫ్ లో అవి పెద్దగా కనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు సినిమాలోని సిచువేషన్ కు తగ్గట్లు బాగా వచ్చాయి. ఇతర నిర్మాణ విలువలు అన్ని బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం, సంగీతం, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
విజువల్ క్వాలిటీ, డబ్బింగ్.
సారాంశం :
ప్రస్తుతం బయట చాలా సామాన్యంగా చూస్తున్న ఒక విషయాన్ని ప్రేక్షకులకు అర్థం అయ్యేవిధంగా చాలా స్మూత్ గా డీల్ చేస్తూ వచ్చిన ఈ “సీత ప్రయాణం కృష్ణతో” చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.


