
వరుసగా సక్సస్ చిత్రాలు తీస్తూ బ్రాండ్ గా మారిన బన్ని వాసు గారు ఇటీవలే లిటిల్ హర్ట్స్ తో బ్లాక్‌బస్టర్ ఆఫ్ ద ఇయర్ గా ట్రెండింగ్ సక్సస్ ని సొంతం చేసుకుని ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి లాంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో ఈ చిత్రం గురించి బన్నివాసు గారు చాలా ఎమెషనల్ గా మాట్లాడుతూ…..”నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారికి థాంక్స్. నేను ముందుగా అడవి శేష్ గారు గురించి మాట్లాడతాను. మేము కలుసుకోవడం చాలా తక్కువ కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అయినది ఎంత మంచి మనసు ఉంటే సినిమాలు స్లోగా చేసినా కూడా ఎవరైనా ఆయన వస్తే మంచి జరుగుతుంది అంటే చాలా త్వరగా వస్తారు. సినిమా అంటే ఎంతో కష్టపడే మీలాంటి వారిని మేము స్క్రీన్ పై మిస్ అవుతున్నాము. మీరు త్వరగా సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. మీలాంటివారు మంచి సినిమాలకు సపోర్ట్ చేస్తే ఆ సినిమాలు ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతాయి” అంటూ అడవి శేష్ గారి గురించి మాట్లాడారు.
రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుంచి మాట్లాడుతూ “మనం ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు చూసాము కానీ ఈ ప్రేమ కథ కాస్త భిన్నమైనది. ఎక్కడో పుట్టిన రోమియో జూలియట్, లైలా మజ్ను వంటి కథలను మనం ఎంతగానో ఆరాధిస్తూ ఇక్కడ హిట్ చేశాము. ఇది మన పక్కనే ఇల్లందలో పుట్టిన ప్రేమ కథ. తెలంగాణలోని ఒక యదార్థ ప్రేమ కథ. బయట చూస్తున్నట్లు పరువు హత్య లేదా మరొకటి కాదు. మన ఊహలకు అందని ఒక దారుణం ఈ ప్రేమ జంటకు జరిగింది. పరుగు హత్యలు వంటివి ఒక అజ్ఞానంతో చేస్తారు కానీ ఇక్కడ జరిగినది ఎంతో దారుణం. ఈ సినిమా లెక్కల్లో మిగిలేది కాదు, గుండెల్లో మిగిలేది. ఈ కథ ఎంతో గౌరవాన్ని కోరుకుంటుంది. ఈ సినిమాలోని చివరి అరగంట ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది. ఇటువంటి కథను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన సాయిలు, ఇటువంటి కథను నిర్మించిన వేణు ఉడుగుల గారికి థాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులకు, సంకేత నిపుణులకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. చైతన్య జొన్నలగడ్డ పాత్ర ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ చిత్రం చూసి దీక్షిత్ పాత్రపై ఎంతగా ప్రేక్షకులకు కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగా ఈ సినిమా చూశాక చైతు పై కోపం వస్తుంది. చైతన్య ప్రేక్షకుల మనసులో మిగిలిపోతారు. అంత గొప్పగా నటించారు. ఈనెల 21వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న రాజు వెడ్స్ రాంబాయి చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.


