అఖండ 2 నుంచి ‘జాజికాయ’ సాంగ్ రేపు గ్రాండ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రం నుంచి ‘జాజికాయ జాజికాయ’ అంటూ సాగే ఎనర్జిటిక్ సాంగ్ రేపు (నవంబర్ 18) రిలీజ్ కానుంది. మొదటి భాగం ‘అఖండ’లో సూపర్ హిట్ అయిన ‘జై బాలయ్య’ సాంగ్ వైబ్‌ను కంటిన్యూ చేస్తూ ఈ పాట రూపొందించారు. విశాఖపట్నం జగదాంబ థియేటర్‌లో లిరికల్ వీడియోను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సహా మొత్తం టీమ్ హాజరవుతుంది.

సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అఖండ తాండవం’ ట్యాగ్‌తో బాలయ్య మార్క్ డాన్స్ స్టెప్స్ ‘జై బాలయ్య’ను మరిపించేలా ఉంటాయని టాక్. ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Related Articles

Latest Articles