
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం,”మార్టేరు” గ్రామంలో ప్రముఖ సినీ నటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సూర్య వెంకట నరసింహ శర్మ కు “జోష్ రవి” ..ఒక్కగానొక్క కుమారుడు ఒక మంచి నటుడుగా జోష్ రవి మన అందరికీ సుపరిచితులే…. మార్టేరు గ్రామంలో మూడో కార్తీక మాసం సోమవారం (nov-10)సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో రవి నాన్నగారు అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు, అక్కడే కుప్పకూలి పోయారు,వెంటనే ఇంటికి వెళ్లే లోపు గుండుపోటుతో తుదిశ్వాస విడిచారు అని డాక్టర్స్ తెలియచేసారు. ఈ వార్త తెలియ గానే మార్టేరు గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. జోష్ రవి తోటి నటీనటులు…సినిమా పెద్దలు కళాకారులు… ఇంటికి వెళ్లి “జోష్ రవి” ని పరామర్శించారు.


