
మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, వరుస బ్లాక్‌బస్టర్‌లతో జోరుమీదున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ‘వీర సింహా రెడ్డి’ సూపర్ హిట్ తర్వాత, ఇప్పుడు హిస్టారికల్ ఎపిక్ #NBK111తో మళ్లీ రానున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
మహిమాన్విత మహారాణి అధ్యాయం ఇప్పుడు ప్రారంభమైంది. గార్జియస్ నయనతార బాలయ్య సరసన హీరోయిన్‌గా చేరారు. ఆమె పాత్ర కథకు కీలకం. ‘సింహా’, ‘జై సింహా’, ‘శ్రీ రామ రాజ్యం’ తర్వాత ఇది వారి నాలుగో కలయిక. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది.ప్రకటన వీడియోలో భారీ స్కేల్, వైభవమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ గోపీచంద్, నయనతారను గుర్రంపై పరిచయం చేస్తూ గ్రాండ్‌గా చూపించారు.
గోపీచంద్ మలినేని మొదటిసారి హిస్టారికల్ డ్రామాకు అడుగుపెట్టారు. తన సిగ్నేచర్ మాస్ అప్పీల్‌తో భారీ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. బాలయ్యను కొత్త అవతారంలో చూపనున్నారు. ఎమోషన్, యాక్షన్ మిశ్రమంతో లార్జర్ దేన్ లైఫ్ స్టోరీటెల్లింగ్ ఉంటుంది.మిగతా క్యాస్ట్, క్రూ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
క్యాస్ట్: నందమూరి బాలకృష్ణ, నయనతార
టెక్నికల్ క్రూ:
రచన, దర్శకత్వం – గోపీచంద్ మలినేని
నిర్మాత – వెంకట సతీష్ కిలారు
బ్యానర్ – వృద్ధి సినిమాస్
పీఆర్ఓ – వంశీ-శేఖర్


