
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దని పిలుపునిచ్చారు. మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడిపై వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
నమ్మకం లేదంటూనే దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారని రాజమౌళిని ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట బహిరంగంగా చెప్పాలని సూచించారు. గతంలో కూడా హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని హెచ్చరించిన రాజాసింగ్, నాస్తిక డైరెక్టర్ల సినిమాలు జనం చూడొద్దని సూచించారు. ఈ వివాదం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


