
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను సందర్శించి, విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారు 1970లలో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించినప్పుడు ఆ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని, అయినప్పటికీ అది హైదరాబాద్‌లోని ముఖ్యమైన సాంస్కృతిక, సినిమా ల్యాండ్‌మార్క్‌గా మారిందని ఆయన గుర్తుచేశారు. నాగార్జున అక్కినేని, అమల అక్కినేని నాయకత్వంలో అన్నపూర్ణ కాలేజీ ద్వారా ప్రపంచ స్థాయి ఫిల్మ్ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నారని కొనియాడారు.
విద్యార్థులు నిర్మించిన ‘రోల్ నెం. 52’ చిత్రాన్ని చూసి హృదయాన్ని తాకినందుకు దర్శకుడు, బృందాన్ని అభినందించారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ దృష్టికి ఫిల్మ్ ఇండస్ట్రీ కీలకమని, చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ ఫిల్మ్ ఐకాన్ల సహకారం కోరుతున్నామని ఆయన తెలిపారు. నాగార్జున అక్కినేని కాలేజీలోని అసాధారణ ప్రతిభ గురించి మాట్లాడటం తన సందర్శనకు ప్రేరణ అని చెప్పారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… తన తండ్రి ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించి అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించారని, ఇప్పుడు అది ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారత్‌లో అత్యుత్తమంగా నిలిచిందని, కాలేజీ ద్వారా భవిష్యత్ స్టోరీటెల్లర్లను పెంచుతున్నామని, డిప్యూటీ సీఎం సందర్శనకు గౌరవం లభించిందని, తెలంగాణ గ్లోబల్ సినిమా వృద్ధికి సహకరిస్తామని అన్నారు.
డిప్యూటీ సీఎం విద్యార్థులను అభినందించి, ఎమర్జింగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహాయం అందిస్తామని, రాష్ట్రాన్ని ఫిల్మ్‌మేకింగ్, మీడియా, ఇన్నోవేషన్, సృజనాత్మకతకు గ్లోబల్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఏఎన్ఆర్ సౌండ్ & విజన్ – ఇండియాలో మొదటి డాల్బీ ఫెసిలిటీ సినిమాను సందర్శించి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీని మెచ్చుకున్నారు.


